Thursday, July 17, 2008

ఆశయ సిద్ధ విద్య పరిచయం

ఎన్నో జన్మల పుణ్య ఫలమే మన ఈ మానవ జన్మ . మరి మనిషి ప్రశాంతత కోల్పోయి సమస్యలతో సతమతమౌతున్నాడు . లక్ష్య సాధనలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అనుకున్న ధ్యేయాన్ని సాధించలేక నిరాశావాది అవుతున్నాడు. అన్నీ ఉన్నా ఏదీలేని నిర్లిప్త భావంతో బాధపడుతున్నాడు. ఎవరిని కదిలించి చూసినా సమస్యల పరంపర కొనసాగుతూనే ఉంది.
* ఎందరో డాక్టర్లను కలిసాను. నా ఆరోగ్యం చక్కబడలేదు !
* వ్యాపారం బాగానే ఉంది.అయినా ఏదీ మిగలటం లేదు !
* పిల్లలు కష్టపడి చదువుతున్నారు.అనుకున్నా స్థితి సాధించటం లేదు !
* మాలో ఏ లోపం లేదు అయినా సంతానం కలగడం లేదెందుకు ?
* ఎంతో అన్యోన్యంగా ఉన్నాము. అయినా మా భార్యాభర్తల మధ్య ఈ వెలితి ఏమిటి ?
* కట్నం కావలసినంత ఇవ్వగలం. అయినా మా బిడ్డకు సరైన సంబంధం కుదరటంలేదు !
* నేనెంతో ఉన్నత చదువులు చదివాను. నా స్థితికి తగిన ఉద్యోగం రావటంలేదు,కారణమేమిటి ?
* నాకన్నీ ఉన్నాయి. ఎందుకో భవిష్యత్తు భయం నను కుంగదీస్తోంది !
* ఎన్నో సమస్యలు, కొన్ని చర్చించదగినవి మరికొన్ని ఎవరితోనూ చెప్పుకోలేనివి.
ఈ మానసిక క్షోభలు,సమస్యల వలయాలకు అంతమేలేదా ?
వీటి నుంచి బయటపడే మార్గం ఉన్నదా?
ఉన్నదంటున్నారు మహానుభావులు.
సమస్య ఎక్కడ ఉందొ, సమాధానము అక్కడే ఉందంటున్నారు.
మరి పరిష్కార మార్గమేమిటి?
ప్రకృతికి మనము ఏమి ఇస్తున్నామో, ప్రకృతి అదే మనకు తిరిగి ఇస్తుంది.
ఇదే సృష్టి రహస్యం. ఈ సృష్టి రహస్యంలోనే మీ పరిష్కార మార్గం ఉంది.
'ఆశయ సిద్ధ సహజ యోగ మార్గాన్ని' అభ్యసించండి, అతి నిగూఢమైన క్రియా యోగ శాస్త్రంతో సమస్యల పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి.
విద్యతో మన జీవితాలను ప్రక్షాళన చేస్తూ మనకు సరైన మార్గనిర్దేశాన్ని ఇస్తుంది కాబట్టి , ఈ సంస్థకు "లైఫ్ స్కాన్ సెంటర్" అనే పేరును పెట్టి ఇందులో "ఆశయసిద్ధ సహజ యోగ విద్య" ను అభ్యసింప చేస్తున్నారు.
ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, సుఖ జీవనాన్ని పొందాలన్న దివ్య సంకల్పముతో పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ మాస్టర్ యం.కే గారిచే " ఆశయ సిద్ధ సహజ యోగ మార్గము " అను శిక్షణా సంస్థను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరు పేట నందు డిసెంబర్ 05, 2002 న స్థాపించబడి ఈ ' ఆశయ సిద్ధ విద్యను ' ప్రపంచ వ్యాప్తం అందించాలని సంకల్పించి ఉన్నారు. ఇందులో ప్రతి మనిషి జీవితంలోని సమస్యల మీద విజయాన్ని సాధించే అతి నిగూఢమైన యోగ అభ్యసాలందు ఉచితముగా శిక్షణ ఇస్తున్నారు.

ఈ 'ఆశయ సిద్ధ విద్యను' అభ్యసించుట వలన కలుగు ప్రయోజనములు

* జీవితములోని - అశాంతి, ఆందోళన, అభద్రతా భావము, ఒత్తిడి, డిప్రెషన్ మొదలగు ఒడిదుడుకులను అధిగమించి విశ్రాంతి, ప్రశాంతతలతో సంపూర్ణ సుఖమయ జీవనాన్ని అందుకోవడం
* ప్రతిఒక్కరికి - శారీరక, మానసిక,ఆర్ధిక, సామాజికముగా ఇబ్బంది పెడుతున్న సమస్యలకు కారణాలైన మూలాలను ఈ ఆశయ సిద్ధ యోగ సాధనతో సంపూర్ణముగా తొలగించుకొని అభ్యాసకులే గాక వారి కుటుంబము, వారి చుట్టూ ఉన్నవారు కూడా ఉన్నత స్థితిని అందుకోవడం
* విద్యార్ధులకు - ఏకాగ్రత,జ్ఞాపక శక్తీ, ఆలోచనా శక్తీ, సృజనాత్మక శక్తీ పెరిగి జీవిత లక్ష్యానికి కావలసిన ఆత్మస్థైర్యం పొందటం
* ఆద్యాత్మిక జిజ్ఞాసులకు - ప్రత్యేక ధ్యాన, యోగ క్రియలతో తమ మనస్సును భగవంతుని శక్తిలో నిలిపి పరమాత్మ తత్త్వాన్ని అర్ధం చేసుకొని, ఆ జ్ఞానంతో తమ జీవిత పరమార్ధమును, ఆశయములను అందుకోవడం
* ముఖ్యంగా - అన్ని అర్హతలున్నా, మీ జీవితము మీరు కోరిన విధముగా కాక, వ్యతిరేక పరిస్థితుల వైపు ఆకర్శింపబడుతున్నప్పుడు దాని నుండి విముక్తి పొందే అతి నిగూఢమైన " క్రియా యోగము " నందు శిక్షణ ఇవ్వబడును